టీ20 సిరీస్ గెలిచిన ఆసీస్
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 లో పాకిస్తాన్ 13 పరుగుల తేడాతో ఓటమి ని చవిచూసింది. పాకిస్తాన్ గెలిచిన వన్డే సిరీ స్ విజయం గాలివాటమే ఈ ఓటమితో మ రోసారి రుజువైంది. వన్డే సిరీస్ తర్వాత జరిగిన టీ20 సిరీస్ మొదటి రెండు మ్యాచ్ల్లో పర్యాటక పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయిం ది. మొదటి టీ20లో కుదేలైన పాక్..
శనివా రం జరిగిన రెండో టీ20లో కూడా ఓడిపో యి మరో మ్యాచ్ మిగిలుండగానే 0-2 తేడాతో సిరీస్ను కోల్పోయింది. టాస్ ఓడి మొదట బౌలింగ్ చేసిన పాక్ ఆస్ట్రేలియాను 147-9 పరుగులకు కట్టడి చేయగల్గింది. రెండో బ్యాటింగ్ చేసిన పాక్ 134 పరుగులకే చేతులెత్తేసి 13 పరుగుల తేడాతో ఓడిపోయింది. జాన్సన్ ఐదు వికెట్లతో పాక్ నడ్డి విరిచాడు.