అవకాశాలను చేజిక్కించుకోవడం, పాత్రలను ఎంపిక చేసుకోవడంలో కొందరు నటులు ప్రత్యేకంగా కనిపిస్తారు. కోస్టార్, దర్శక నిర్మాతలతో పని లేకుండా కథ నచ్చితే చాలు ఓకే చెప్పేస్తారు. యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి ఆ కోవకే చెందిందా? అంటే, ఔననే సమాధానమే వస్తోంది! చిన్న సినిమాలతో కెరీర్ ప్రారంభించిన మీనాక్షి అనతి కాలంలోనే స్టార్ హీరోలతో జత కట్టే చాన్సులు కొట్టేసింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. టాలీవుడ్‌తో పాటు అటు కోలీవుడ్ ప్రేక్షకులనూ ఆకట్టుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’తోపాటు ‘గోట్ : ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్’లో తమిళ స్టార్ కథానాయకుడు దళపతి విజయ్‌తో త్వరలో కనిపించనున్నది.
దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’తోనూ ప్రేక్షకుల ముందుకు రానున్నది. వరుణ్ తేజ్ ‘మట్కా’లో విశ్వక్సేన్ హీరోగా తెరకెక్కుతున్న మరో చిత్రంలోనూ ఈ ముద్దుగుమ్మే కథానాయిక. ఇదిలా ఉండగా, మీనాక్షి చౌదరికి సంబంధించిన తాజా వార్త ఒకటి వినిపిస్తున్నది. తమిళ స్టార్ కమెడియన్ అయిన సంతానం హీరోగా నటిస్తున్న ‘దిల్లుకు దుడ్డు సినిమాలో ఈ అమ్మడినే హీరోయిన్గా తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ హీరో ఆర్య నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రేమానంద్ దర్శకత్వం వహిస్తన్నారు. ఓ పక్క స్టార్ హీరోల సరసన నటిస్తూనే కమెడియన్‌తో జత కట్టడంపై కోలీవుడ్‌లో చర్చనీ యాంశమైంది. హీరో ఎవరైనప్పటికీ పాత్ర నచ్చితే సైన్ చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మీనాక్షి చౌదరి సైతం అదే బాటను ఎంచుకొని కమెడియన్‌తో కలిసి ఆడిపాడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.