వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను పరామర్శించే తీరిక బండి సంజయ్ కి లేదా?
వరద ప్రాంతాలకు కేంద్రం నుండి నిధులు తీసుకు రావడంలో బండి సంజయ్ విఫలం
సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు
కరీంనగర్, (విజయక్రాంతి): కరీంనగర్ లో వర్షాలు పడి వరద లచ్చి తీవ్ర పంట నష్టం జరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులలో ఉంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్కడ ఉన్నాడని బుధవారం రోజున స్థానిక పదవ డివిజన్ హనుమాన్ నగర్ ప్రజలతో కలిసి పైడిపల్లి రాజు విమర్శించారు. కరీంనగర్ నగరంలో మొన్న కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాలు బురద మయమయ్యాయని, ఇండ్లలోకి రోడ్లపైకి నీరు వచ్చి చాలామంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని కనీసం వారిని పరామర్శించడానికి బండి సంజయ్ కి తీరిక లేకపోవడం బాధాకరమని ఆయన అన్నారు.
ఓట్ల కోసం ఇంటింటా తిరిగే నాయకులు ప్రజలకు ఆపద వస్తే అటువైపు కన్నెత్తి చూడకపోవడం విచారకరమని కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులను తీసుకు రావడంలో విఫలం చెందాడని, వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని కనీసం నియోజకవర్గంలో ఒక ప్రాంతం కూడా పర్యటించకపోవడం చూస్తుంటే తనకు ప్రజల పట్ల ఏ విధంగా ప్రేమ ఉందో అర్థం అవుతుంది అన్నారు. జిల్లాలోజరిగిన నష్టం పై కనీసం అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయకపోవడం విచారకరమన్నారు.
నగరంలో ఇంటింటా విష జ్వరాలు తాండవిస్తున్నాయని వైద్య సహాయం సరిగా అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మనో ధైర్యం చెప్పాల్సిన పార్లమెంట్ సభ్యుడే ప్రజలకు దూరంగా ఉండడం సరైంది కాదన్నారు. వెంటనే కేంద్రం మంత్రి నియోజకవర్గంలో పర్యటించి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులను తీసుకురావాలని వరద బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. లేనిపక్షంలో ప్రజా ఆగ్రహానికి గురి కాక తప్పదని పైడిపల్లి రాజు హెచ్చరించారుఈసమావేశంలో సిపిఐ నాయకులు బైరి విజయ్, కొత్తకొండ శంకర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.