calender_icon.png 24 December, 2024 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి మెట్రో స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్

06-10-2024 12:48:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 5 (విజయక్రాంతి): నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద గల పార్కింగ్‌లలో నేటి(ఆదివారం) నుంచి పెయిడ్ పార్కింగ్‌ను అమలు చేయబోతున్నారు. ఇప్పటికే ఎల్‌అండ్‌టీ సంస్థ పార్కింగ్ స్థలాల్లో ఛార్జీల వివరాల బోర్డులను కూడా ఏర్పాటు చేసింది.

కాగా, ఇంతకాలం ఉచిత పార్కింగ్ అమలులో ఉన్న నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద నామమాత్రపు ఛార్జీలను అమలు చేయబోతున్నట్లు సెప్టెంబర్ 30న ఎల్‌అండ్‌టీ యాజమాన్యం ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాలని నిరసన 

మెట్రో ప్రయాణికులకు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాలని యువజన సంఘాల నాయకులు, మెట్రో ప్రయాణికులు డిమాండ్ చేశారు. అక్టోబర్ ఆరు నుంచి పార్కిం గ్ ఫీజులు వసూలు చేయబోతున్నట్లు ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రకటించిన నేపథ్యంలో శనివారం నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద గల పార్కింగ్ ప్రాం తంలో యువజన సంఘాల నాయకులు, ప్రయాణికులు నిరసన తెలిపారు.

మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ఎల్‌అండ్‌టీ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్, పీవైఎల్ రాష్ట్ర నాయకుడు భూషణవేణి కృష్ణ, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ.. మెట్రో ప్రయాణికుల నుంచి పార్కింగ్ ఛార్జీలు వసూలు చేసే ఆలోచనను ఎల్‌అండ్‌టీ సంస్థ విరమిం చుకో వాలన్నారు. ప్రభుత్వ భూములను ఉచితంగా తీసుకొని పెయిడ్ పార్కిం గ్ అమలు చేయడం సరికాదన్నారు.