హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి) : రాష్ట్రంలో జరిగే లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగేందుకు ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంటోంది. శాశ్వత, ఒప్పంద కార్మికులకు వేతనంతో కూడిన పూర్తి సెలవుదినం ప్రకటించాలని ప్రభుత్వం సంస్థలను ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంటు స్ధానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉన ఎన్నిక జరగనుంది.