29-04-2025 01:25:49 AM
పాకిస్తాన్ తీరుపై భారతీయుల మండిపాటు
హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): పెహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ సో మవారం అమెరికాలోని న్యూయార్క్ వద్ద ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వద్ద భారతీయులు నిరసన తెలిపారు. ఈ దాడి కేవలం వ్యక్తులపైన చేసింది మాత్రమే కాదని మానవత్వం, శాంతి, విశ్వాస సూత్రాలపైన జరిగిన దాడి గా అభివర్ణించారు.
ఈ సందర్భంగా మృతులకు సంతాపం ప్రకటించారు. ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం కచ్చితంగా ఉందని, అయితే కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు పని గట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్ర వాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్తాన్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.