25-04-2025 12:48:49 AM
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: పహల్గాం ఉగ్రదాడిని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తీవ్రంగా ఖండించింది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. గు రువారం న్యూఢిల్లీ అక్బర్ రోడ్‌లోని ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు తీర్మా నాలు చేశారు. ఈ దాడి పాకిస్థాన్ మద్దతు తో పన్నిన కుట్రగా సీడబ్ల్యూసీ అభివర్ణించింది.
దాడి ఘటనలో పర్యాటకులను కాపా డే ప్రయత్నంలో ప్రాణాలు విడిచిన స్థానిక హార్స్ రైడర్ పోరాటాన్ని గుర్తుచేసుకుంది. ఇది భారతీయ ప్రజాస్వామ్య విలువలపై నేరుగా జరిగిన దాడిగా పేర్కొంది. కేంద్ర పా లిత ప్రాంతాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్వయంగా పర్యవేక్షిస్తుందని గుర్తుచేసింది. కేంద్రపాలిత ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం భద్రతా వైఫల్యమేనని పేర్కొంది.
ప్రధాని ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఉం దని స్పష్టం చేసింది. ఈ ఘటనను బీజేపీ రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుంటుదని సీడబ్ల్యూసీ ఆరోపించింది. దేశాన్ని ఏకతాటి పై నడపాల్సిన తరుణంతో విభేదాలు రేకేత్తించేలా రెచ్చగొట్టడం తగదని బీజేపీ నేతలకు సీడబ్ల్యూసీ సభ్యులు హితవు పలికారు.