03-04-2025 12:00:00 AM
కరీంనగర్, ఏప్రిల్ 2 (విజయ క్రాంతి): ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పగిడిమర్రి సోలొమన్ బుధవారం బాధ్యతల స్వీకరించారు. గతములో అదిలాబాద్ రీజినల్ మేనేజర్ గా పనిచేసే ఆయన పదవోన్నతి పై కరీంనగర్ జోన్ కు బదిలీ అయ్యారు.
ఈడిగా పని చేసిన ఖుస్రో షా ఖాన్ నుండి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కు కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి రాజు, డిప్యూటీ రీజినల్ మేనేజర్ (మెకానికల్) బి.వి.రావు, డిప్యూటీ రీజినల్ మేనేజర్ (ఆపరేషన్) ఎస్. భూపతి రెడ్డి, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ (కరీంనగర్ జోన్ ) విలాస్ రెడ్డి, జోనల్ వరక్స్ మేనేజర్ సుగుణాకర్, డిప్యూటీ చీఫ్ అకౌంట్స్ స్వప్న కుమారి, జోనల్ హాస్పిటల్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ సి గిరిసిమ్హారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోచయ్య లింగం, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సభ్యులు దొంతు రాజయ్య, రాజు, శేఖర్, రాంనర్సయ్య, శ్రీనివాస్, లక్పతి పుష్ప గుచ్చము ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.