- కలిసికట్టుగా అభివృద్ధి చేద్దాం
- కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, నవంబరు 2 (విజయక్రాంతి): పగలు, పంతాలు, రాజకీయ కక్షలతో కార్యకర్తలు కొట్టుకోవడం, గొడవలు పడటం తప్ప సాధించేదేమీ లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా అభివృద్ధి చేసి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేయాలన్నారు.
శనివా రం చొప్పదండి నియోజకవర్గంలోని మల్యా ల మండల కేంద్రంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభతో కలి సి రూ.25 కోట్ల వ్యయంతో మల్యాల చౌర స్తా నుంచి కాచారం వరకు నిర్మిస్తున్న డబు ల్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
చాలా రోజుల తర్వాత అధికారులు ప్రొటోకాల్ పాటించడం కనిపించిందని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నడూ ప్రొటోకాల్ పాటించలేదని విమర్శించారు. కమీషన్లకే ప్రాధాన్యమిచ్చిందని, నిబంధనల ప్రకారం పనిచేయలేదన్నారు. కాగా మల్యాల నుంచి కాచారం వరకు రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు చేసిన ప్రధాని మోదీ, కేంద్ర మం త్రి నితిన్ గడ్కరీకి బండి సంజయ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.