13-03-2025 01:44:28 AM
హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): తెలంగాణ ఎంపీడీవో రాష్ర్ట అధ్యక్షురాలిగా జొన్నల పద్మావతి ఎన్నికయ్యారు. నాంపల్లిలోని టీజీవో భవనంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అనుబంధ సంస్థ తెలంగాణ ఎంపీడీవో అసోసియేషన్ రాష్ర్ట కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణ ఎంపీడీవో రాష్ర్ట అధ్యక్షురాలిగా జొన్నల పద్మావతి ఎన్నికైనట్లు బుధవారం ప్రకటించారు.
అసోసియేట్ ప్రెసిడెంట్‌గా గంగుల సంతోష్ కుమార్, ఉపాధ్యక్షులుగా శేషాద్రి, దివ్య దర్శన్, భారతి, సెక్రటరీగా మోహన్, జాయింట్ సెక్రటరీలుగా చిరంజీవి, యాకుబ్ నాయక్, హిమబిందు, కోశాధికారిగా మహేష్ బాబు ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని టీజీవో అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస రావు, సెక్రటరి సత్యనారయణ సన్మానించారు.