09-03-2025 12:39:03 PM
రెండో రోజు పద్మశ్రీ హిల్స్ వాసుల ఆందోళన
అధికారులతో మాట్లాడిన రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్
రాజేంద్రనగర్: హామీలు వద్దు.. ముందుగా తమకు తాగునీరు ఇవ్వాలని బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్(Bandlaguda Municipal Corporation) పరిధిలోని పద్మశ్రీ హిల్స్ వాసులు రెండో రోజు సన్ సిటీ ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. ఖాళీ బిందేలతో పలువురు మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే తమకు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్(State Mudiraj Corporation Chairman Gyaneshwar Mudiraj) అక్కడికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. ఈ విషయమై వెంటనే ఆయన సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడారు సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన సూచించారు. సమస్య పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన ఆందోళనకారులకు హామీ ఇచ్చారు.