calender_icon.png 10 March, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాసభకు తరలిన పద్మశాలీలు

09-03-2025 07:07:30 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఆదివారం చేపడుతున్న 17వ అఖిల భారత పద్మశాలి మహాసభకు జిల్లా నుండి పద్మశాలీలు ప్రత్యేక వాహనాలలో తరలి వెళ్లారు. అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజ్ కి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతామని సీఎం ప్రకటించడం పట్ల పద్మశాలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ బయలుదేరిన వారిలో జిల్లా అధ్యక్షుడు ఇరుకుల్లా ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు నల్ల కనకయ్య, శంకర్, ఆసిఫాబాద్ అధ్యక్ష కార్యదర్శులు హనుమాండ్ల శ్రీకాంత్, ఆల్లె శ్రీకాంత్, కోమటిపల్లి లింగయ్య, రమేష్, చందు, మంగ, సునీత తదితరులు ఉన్నారు.