calender_icon.png 23 December, 2024 | 6:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పద్మశాలీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

23-12-2024 02:28:27 AM

రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు 

హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): పద్మశాలీ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం హైదరా బాద్‌లో రాష్ర్ట కార్యవర్గ సమావేశం నిర్వహించి పలు తీర్మానాలను ఆమోదించారు.

అనంతరం జిల్లాల్లో పద్మ శాలీ ఉద్యోగుల ఆత్మీయ సమావేశా లు, ప్రతిభా పురస్కార కార్యక్రమాలు నిర్వహించిన ఆయా జిల్లాల బాధ్యులను వెంకటేశ్వర్లు అభినందించారు. కార్యక్రమంలో రాష్ర్ట కమిటీ మెంబ ర్లు యాదగిరి, యాదగిరేందర్, రాంమోహన్, లక్ష్మీపతి, సుజాత, వెంకట్ రావు, చంద్రశేఖర్, శ్రీనివాసులు, విజయలక్ష్మి, రాజేశం, శ్రీనివాసులు, సారయ్య తదితరులు పాల్గొన్నారు.