09-02-2025 12:54:44 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): బీసీ కుల గణన గణాంకాలు వాస్తవాలకు భిన్నంగా ఉన్నాయని, తక్షణమే మళ్లీ సర్వే చేసి పద్మశాలీలల లెక్కలు పక్కాగా తేల్చాలని తెలంగాణ రాష్ర్ట పద్మశాలీ సంఘం డిమాండ్ చేసింది.
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం అధ్యక్షుడు వల్లకాటి రాజకుమార్ మాట్లాడుతూ.. రాష్ర్ట వ్యాప్తంగా పద్మశాలీలు కేవలం 11 లక్షల మాత్రమే ఉన్నారని చెప్పడం విడ్డూరంగా ఉన్నదన్నారు.
30 లక్షలకు పైగా పద్మశాలీల జనాభా ఉంటుందన్నారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం రాబోవు 10 సంవత్సరాలు తమ సామాజిక వర్గానికి విద్య, ఉద్యోగ, ఉపాథి, రాజకీయ రంగాలలో తీరని అన్యాయం జరుగుతుందన్నారు.
సం ఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి అప్పం శ్రీనివాస్, కోశాధికారి నవీన్, గౌరవ అధ్యక్షుడు వేముల బాలరాజు, బురా మల్లేష్, ఉపాధ్యక్షుడు వనమాల శంకర్ , సిహెచ్ చంద్రుడు, తదితరులు పాల్గొన్నారు.