calender_icon.png 9 March, 2025 | 10:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పద్మశాలీలు ఐక్యత చాటాలి

07-03-2025 01:14:29 PM

సంఘం జిల్లా అధ్యక్షుడు ఇరుకుల్ల ఆంజనేయులు 

కుమ్రం భీం అసిఫాబాద్, (విజయక్రాంతి): పద్మశాలీలు ఐక్యతను చాటాలని సంఘం జిల్లా అధ్యక్షుడు ఇరుకుల్ల ఆంజనేయులు అన్నారు. ఈనెల 9 న హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించే 17వ అఖిలభారత పద్మశాలి మహాసభ, 8 వ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం  మహా సభలకు సంబంధించిన వాల్ పోస్టర్లను నాయకులతో కలిసి శుక్రవారం జిల్లా కేంద్రంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  అఖిల భారత పద్మశాలి సంఘం  దేశంలోనే బలమైన సంఘంగా ఎదిగిందన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో హక్కుల సాధన కోసం ఏకతాటిపై ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. జిల్లాలోని పద్మశాలీలు అత్యధిక తరలి వచ్చి మహాసభలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు  గుండా శంకర్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు అనుమాండ్ల శ్రీకాంత్, అల్లె శ్రీకాంత్,గౌరవాధ్యక్షుడు లింగయ్య, నాయకులు గుండా శ్యామ్, శైలేందర్, యేసయ్య ,మోహన్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.