calender_icon.png 23 December, 2024 | 12:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలి

15-10-2024 12:40:40 AM

అదిలాబాద్ ఎంపీ నగేశ్

కుమ్రంభీంఆసిఫాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలని అదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని పద్మ శాలీ భవన్‌లో సోమవారం పద్మశాలీ సంఘం ఆధర్యంలో నిరహించిన దసరా అలయ్ బలయ్ కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే పాలాయి హరీష్‌బాబు, బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ఎంపీ పాల్గొని మాట్లాడారు.

చేతివృత్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని ఎంపీ నగేశ్ అన్నారు. చేనేత కళాకారులకు అండగా ఉంటూ వారి అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పాలాయి హరీష్ అన్నారు. పట్టణంలోని ఆదర్ నగర్‌లో పద్మశాలీ సంఘ భవనం దాదాపుగా పూర్తి కావచ్చిందని తెలిపారు.

చేనేత కళాకారులను మనం ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. ఎల్లవేళలా వారి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అనంతరం డీఎస్సీ ఫలితాల్లో ఉద్యోగం సాధించిన 16 మంది పద్మశాలీలను అభినందించారు.

కార్యక్రమంలో పద్మశాలీ సంఘం అధ్యక్షుడు కుడిక్యాల రాజమౌళి, ప్రధాన కార్యదరి వనమా ల కేదారి, జిల్లా గౌరవ అధ్యక్షుడు సామల రాజన్న, బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు కొంగ సత్యనారాయణ, బీజేపీ పట్టణ అధ్యక్షుడు సిందం శ్రీనివాస్, పద్మశాలీ సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు నల్ల కనకయ్య, జిల్లా ప్రధాన కార్యదరిగడదాసు మల్లయ్య పాల్గొన్నారు. అనంతరం ఇస్గాం, బెజ్జూర్ మండలాల్లో నిర్వహించిన బీజేపీ సభ్యత నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ బాబుతో కలిసి ఎంపీ  నగేష్ పాల్గొన్నారు.