calender_icon.png 22 September, 2024 | 1:52 AM

పద్మజ సుజుకీ నూతన షోరూం ప్రారంభం

26-07-2024 01:14:58 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 25 (విజయక్రాంతి)/ఇబ్రహీంపట్నం: సుజుకీ బైక్స్ అగ్రశ్రేణి డీలర్ పద్మజ సుజుకీ నూతన షోరూం గురువారం ఇబ్రహీంపట్నంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సుజుకీ రీజినల్ మేనేజర్ (సేల్స్) కే వెంకటేశ్, రీజినల్ మేనేజర్ (సర్వీస్) బీ సత్యదేవ్, వరుణ్ గ్రూప్ డైరెక్టర్ వీ వరుణ్‌దేవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరుణ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నంలో సుజుకీ కస్టమర్ల కోసం అత్యాధునిక షో రూం, వర్క్‌షాప్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. అతి తక్కువ డౌన్ పేమెంట్, అతి తక్కువ వడ్డీరేట్లు, ఫైనాన్స్ స్కీంలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా గండిపేటలోనూ పద్మ సుజుకీ నూతన షోరూంను ప్రారంభించారు. కార్యక్రమంలో పద్మజ సుజుకీ సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు.