calender_icon.png 28 January, 2025 | 1:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్

26-01-2025 12:29:41 AM

  1. వాసుదేవన్ నాయర్‌కు కూడా.. 
  2. బాలకృష్ణ, అజిత్, మనోహర్ జోషి, శోభన చంద్రకుమార్‌లకు పద్మభూషణ్
  3. మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ
  4. విదేశీయులకు కూడా పద్మ అవార్డులు


న్యూఢిల్లీ, జనవరి 25: కేంద్ర ప్రభుత్వం మొత్తం 139 మందికి ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను ప్రకటించింది. 7 పద్మవిభూషణ్, 19 పద్మ భూషణ్, 113 పద్మశ్రీ అవార్డులకు పలువురిని ఎంపిక చేసింది. తెలంగాణకు చెందిన డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డికి వైద్య రంగంలో పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించారు.

అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ తెలుగు హీరో నందమూరి బాలకృష్ణకు కళల విభాగంలో పద్మభూషణ్ పురస్కారం లభించింది. తెలంగాణకు చెందిన మందకృష్ణకు పద్మ పురస్కారం లభించింది. ఇక క్రీడల రంగంలో ఐదుగురికి పద్మ అవార్డులు లభించాయి. హాకీ మాజీ ఆటగాడు శ్రీజేష్ (కేరళ)కు పద్మభూషణ్ అవార్డు రాగా..

మాజీ క్రికెటర్ అశ్విన్ (తమిళనాడు), మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు విజయన్ (కేరళ), అథ్లెటిక్స్ కోచ్ సత్యపాల్ సింగ్ (ఉత్తర్‌ప్రదేశ్)కు పద్మశ్రీ, పారా అథ్లెట్ హర్వీందర్ సింగ్ (హర్యానా)కు అవార్డులు లభించాయి. కొందరికి మరణానంతరం పద్మ అవార్డులు రాగా.. మరికొందరు విదేశీయులను కూడా అవార్డులు వరించాయి. 

పద్మశ్రీ అవార్డు గ్రహీతలు (మొత్తం 113 మంది)

* మందకృష్ణ మాదిగ (ప్రజావ్యవహారాలు)- తెలంగాణ

* అశ్విన్ (క్రీడలు)- తమిళనాడు

* అరుంధతీ భట్టాచార్య (ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ)- మహారాష్ట్ర

* అర్వింద్ శర్మ (సాహిత్యం, విద్య)- కెనడా

* హర్వీందర్ సింగ్ (పారాఒలింపియన్)- హర్యానా

* హ్యూగ్ అండ్ కొల్లీన్ గాంట్జర్ (జర్నలిజం) (మరణానంతరం)- ఉత్తరాఖండ్

* మని విజయన్ (క్రీడలు)- కేరళ

* జోనస్ మాసెట్టి (ఆధ్యాత్మికం)- బ్రెజిల్

* ప్రశాంత్ ప్రకాశ్ (వాణిజ్యం, పరిశ్రమలు)- కర్ణాటక

పద్మవిభూషణ్ గ్రహీతలు

* డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి (వైద్యరంగం)-తెలంగాణ

* జస్టిస్  జగదీశ్ ఖేహర్ (పదవీ విరమణ)(ప్రజావ్యవహారాలు)- చండీగఢ్

* కుముదిని రజినీకాంత్ లాఖియా (కళలు)- గుజరాత్

* లక్ష్మీనారాయణ సుబ్రమణియం (కళలు)- కర్ణాటక

* వాసుదేవన్ నాయర్ (సాహిత్యం, విద్య) (మరణానంతరం)- కేరళ

* ఓసాము సుజుకీ (వాణిజ్యం, పరిశ్రమలు) (మరణానంతరం)- జపాన్

* శారదా సిన్హా (కళలు)- బీహర్

పద్మభూషణ్ గ్రహీతలు

* సూర్యప్రకాశ్ (సాహిత్యం, జర్నలిజం)- కర్ణాటక

* అనంత్ నాగ్ (కళలు)- కర్ణాటక

* నందమూరి బాలకృష్ణ (కళలు) - ఆంధ్రప్రదేశ్

* బిబేక్ దెబ్రాయ్ (సాహిత్యం, విద్య) (మరణానంతరం)- ఎన్‌సీటీ ఢిల్లీ

* జతిన్ గోస్వామి (కళలు)- అస్సాం

* జోస్ చాకో పెరియప్పురం (వైద్యం)- కేరళ

* కైలాశ్ నాథ్ దీక్షిత్ (ఆర్కియాలజీ)-ఎన్‌సీటీ ఢిల్లీ

* మనోహర్ జోషి (ప్రజావ్యవహారాలు) (మరణానంతరం)- మహారాష్ట్ర

* కుప్పుస్వామి చెట్టి (వాణిజ్యం, పరిశ్రమలు)- తమిళనాడు

* శ్రీజేష్ (క్రీడలు)- కేరళ

* పంకజ్ పటేల్ (వాణిజ్యం, పరిశ్రమలు)- గుజరాత్

* పంకజ్ ఉదాస్ (కళలు) (మరణానంతరం)- మహారాష్ట్ర

* అజిత్ కుమార్ (కళలు)- తమిళనాడు 

* శేఖర్ కపూర్ (కళలు)- మహారాష్ట్ర

* శోభన చంద్రకుమార్ (కళలు)- తమిళనాడు

* సుశీల్ కుమార్ మోదీ (ప్రజావ్యవహారాలు) (మరణానంతరం)- బీహార్

* వినోద్ ధామ్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్)- అమెరికా