calender_icon.png 3 October, 2024 | 4:32 PM

ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా పద్మ శ్రీకాంత్ ఎన్నిక

03-10-2024 02:03:01 PM

అభినందించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా పద్మ శ్రీకాంత్ గురువారం ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు తోపాటు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు లు ఎన్నుకున్నారు. గతంలో బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ గా సత్యం కొనసాగారు. అతనిపై అవిశ్వాసం పెట్టిన కౌన్సిలర్లు పద్మ శ్రీకాంత్ ను ఎన్నుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ లు కాంగ్రెస్ లో చేరడంతో 12 మంది కౌన్సిలర్లకు ఎనిమిది మంది కౌన్సిలర్లతోపాటు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఓటు ఉండడంతో మొత్తం తొమ్మిది మంది పద్మ శ్రీకాంత్ కు ఓటు వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్డీవో ప్రభాకర్ తెలిపారు. 

మున్సిపల్ చైర్ మెన్ గా పద్మా శ్రీకాంత్ ను ఎన్నుకున్నారు. గతంలో అవిశ్వాసం పెట్టినప్పుడు కౌన్సిలర్లను క్యాంపుకు తరలించారు. అప్పుడే ఎన్నుకోవాల్సి ఉండగా పాత చైర్మన్ సత్యం హైకోర్టుకు వెళ్లారు. దీంతో చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. నూతనంగా ఎన్నికైన ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపుకు సూచికగా ఎల్లారెడ్డి మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగిరేయడం జరిగిందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత పాటిష్ఠవంతం చేసి రానున్న స్థానిక సంస్థలు కాంగ్రెస్ జెండాను అన్ని గ్రామ పంచాయతీలలో ఎగరవేయడం ఖాయమన్నారు. ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా పద్మా శ్రీకాంత్ ను ఎన్నుకునేందుకు సహకరించిన కౌన్సిలర్లకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అభినందనలు తెలిపారు.