calender_icon.png 19 April, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పద్మశ్రీ అవార్డు గ్రహీత 'వనజీవి రామయ్య' కన్నుమూత

12-04-2025 07:50:34 AM

రామయ్యను పద్మశ్రీతో సత్కరించిన కేంద్రం

హైదరాబాద్: పద్మశ్రీ అవార్డు గ్రహీత(Padma Shri Awardee) వనజీవి రామయ్య కన్నుమూశారు. వనజీవి రామయ్య గుండెపోటుతో తుదిశ్వాస(Vanajeevi Ramaiah Passes Away) విడిచారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. రామయ్య ఇంటి పేరును వనజీవిగా మార్చుకున్న వృక్ష ప్రేమికుడు. ఆయన జీవితమంతా మొక్కలు నాటి పెంచాడు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి చెందిన రామయ్య 2017లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. కోటికి పైగా మొక్కలు నాటి సరికొత్త చరిత్ర సృష్టించాడు. రోడ్ల పక్కన, పాఠశాలలు, ఆస్పత్రులు, దేవాలయాల్లో రామయ్య మొక్కలు నాటారు. వనజీవి రామయ్య(Vanajeevi Ramaiah) వృక్షో రక్షతి రక్షితః అంటూ నిత్యం ప్రచారం చేశారు. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.