కుకునూరు పల్లి బిజెపి మండల అధ్యక్షుడు అనుముల సంపత్ రెడ్డి
కొండపాక, ఫిబ్రవరి 2 : మూడు దశాబ్దాలుగా మాదిగ జాతి వర్గీకరణ, అణగారిన వర్గాల హక్కులు, సంక్షేమ పథకాల గురించి సుదీర్ఘ పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ ని కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గుర్తించి ఆయనకు పద్మశ్రీ పురస్కారం ఇచ్చిన సందర్భంగా కుక్కునూరు పల్లి మండలం చిన్న కిష్టాపూర్ గ్రామ ఎమ్ ఆర్ పి ఎస్ గ్రామ అధ్యక్షులు సోమి కరుణాకర్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, మందకృష్ణ మాదిగ ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుక్కునురుపల్లి మండల బిజెపి అధ్యక్షుడు అనుముల సంపత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబండ, అనగారిన వర్గాల అభివృద్ధి ప్రధాని ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ బూతు అధ్యక్షులు తన్నీరు యాదగిరి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పాపగోని సదానంద్, గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కర్రోళ్ల ప్రవీణ్, అర్జున్, ఎమ్ ఆర్ పి ఎస్ గ్రామ అధ్యక్షులు ఉపాధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.