calender_icon.png 20 April, 2025 | 11:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోలాహలంగా పజ్జన్న జన్మదిన వేడుకలు

08-04-2025 12:38:50 AM

వారసిగూడ, ఏప్రిల్ 7 (విజయక్రాంతి) : సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుల్ల పద్మారావు గౌడ్ జన్మదిన వేడుకలు సికింద్రాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం కోలాహలంగా జరిగాయి. ఎం.ఎల్.ఏ. పద్మారావు గౌడ్ హాజరు కానప్పటికీ, నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, యువత, మహిళా, విద్యార్ధి, కార్మిక వంటి అనుబంధ విభాగాల నేతలు వివిధ ప్రాం తాల్లో ఆయన  జన్మదిన కార్యక్రమాలను నిర్వహించారు.

కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ లతో పాటు అడ్డగుట్ట, మెట్టుగూడ, తార్నాక, సితాఫల మండీ, బౌద్దనగర్ డివిజన్లలోని బీ.ఆర్. ఎస్. నేతలు పద్మారావు గౌడ్ జన్మదిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని, వివిధ ప్రాంతా ల్లో అన్నదానం, అనాధశ్రమాల్లో పండ్ల పంపి ణీ, మొక్కలు నాటడం, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఇతరత్రా  సేవా కార్యక్రమాలు నిర్వహించారు.