calender_icon.png 22 October, 2024 | 4:59 AM

మట్కాలో పద్మగా..

22-10-2024 12:00:00 AM

వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మట్కా’. కరుణకుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్ మెంట్స్, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెం ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లు. నవీన్‌చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజ య్, పీ రవిశంకర్‌తోపాటు సలోని కీలక పాత్రలు పోషిస్తున్నారు.

నవంబర్ 14న థియేటర్లలోకి రానున్న ఈ మూవీ నుంచి తాజాగా నటి సలోని పాత్రను పద్మగా పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో సలోని చీరకట్టులో హుందాగా కనిపించింది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్; సినిమాటోగ్రఫీ: ఏ కిషోర్‌కుమార్; కాస్ట్యూమ్స్: కిలారి లక్ష్మి; నిర్మాతలు: డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి; కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్.