calender_icon.png 2 November, 2024 | 4:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు రోజుల్లో ధాన్యం కొనకపోతే.. ఉద్యమం తప్పదు

02-11-2024 02:44:36 PM

మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి హెచ్చరిక 

మెదక్, విజయక్రాంతి: సోమవారం లోపు  దాన్యం కొనుగోలు చేయకపోతే  బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి  ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తామని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మ దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కొబ్బరికాయలు కొడుతూ  కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం కాదని, త్వరితగతిన అకాల వర్షాల నుంచి రైతులను ఆదుకుని ధాన్యాన్ని తూకం వేసి కర్షకులను ఆదుకోవాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నుండి కొనుగోలు కేంద్రాల్లో దాన్యం తూకం చేయకపోతే బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల తరఫున అన్నదాతల పక్షాన నిలబడి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పి పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుండా రైతులను నిండా ముంచిందన్నారు. రైతు భరోసా ఇవ్వకుండా రైతులను నట్టేట ముంచిందన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి రైతులు ఓట్లేస్తే  ఆరు కాలం రైతులు కష్టపడి పండించిన పంటను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయకుండా రైతులకు చుక్కలు చూపిస్తున్నారని ఆరోపించారు. గత బి అర్ ఎస్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెనువెంటనే కొనుగోలు కేంద్రాల ప్రారంభించి త్వరితగతిన ధాన్యం తూకం వేసి 72 గంటల్లో రైతుల ఖాతాలో నగదు జమ చేశామని గుర్తు చేశారు. సన్న నరకానికి రూ. 500 బోనాస్ ఇవ్వడం దేవుడెరుగు, అసలు ధాన్యమే కొనడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు టపారియన్  కవర్లు ఇవ్వకపోవడం ద్వారా ధాన్యం అకాల వర్షాలకు తడచి  ముద్దయి మొలకలు వస్తున్నాయి. దీనివలన రైతులు క్వింటాళ్ల  కొద్దీ ధాన్యం  నష్టపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేసి గిట్టుబాటు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.