calender_icon.png 24 March, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐదెకరాల భవంతిలో సీతక్క.. 500 గజాల ఇంట్లో నేను.. X తమ్ముడూ నా లైఫ్ స్టుల్ వేరు నీ లైఫ్ స్టుల్ వేరు

23-03-2025 12:49:28 AM

ఐదెకరాల భవంతిలో సీతక్క.. 500 గజాల ఇంట్లో నేను..

  1. పంట బోనస్.. పెద్ద బోగస్
  2. మంత్రి సీతక్కపై కౌశిక్‌రెడ్డి ఫైర్

హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): మంత్రి సీతక్క ఐదు ఎకరాల భవంతిలో ఉంటున్నారని, తాను 500 గజాల ఇంట్లో ఉంటున్నానని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. శనివారం అసెంబ్లీలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో భాగం గా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభు త్వం చెబుతున్న పంట బోనస్, రైతు భరోసా పెద్ద బోగస్ అని ఆరోపించారు.

మంత్రి సీతక్క ములుగు నియోజకవర్గంలో తీరగడం లేదని.. అందుకే రైతుల కష్టాలు ఆమెకు తెలియడం లేదని తెలిపారు. తమ నియో జకవర్గాల్లో తిరిగి.. ఎవరెక్కువ ప్రజలకు అందుబాటులో ఉం టారో తెలుసుకుందామన్న మంత్రి సీతక్క విసిరిన సవాల్‌ను తాను స్వాగతిస్తున్నట్టు కౌశిక్‌రెడ్డి తెలిపారు. రైతు భరోసా రూ.15 వేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక రూ.12 వేలతో సరిపెట్టారని విమర్శించారు.

తన నియోజకవర్గంలో చాలా మంది రైతులకు రుణాలు మాఫీ కాలేదన్నారు. తాను సీ తక్క గురించి అమర్యాదగా మాట్లాడలేదని, ఒకవేళ అలా మాట్లాడినట్టు అనిపిస్తే వెనక్కి తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. అయితే మంత్రి సీతక్క తనకు అక్క లాంటిదని కౌశిక్‌రెడ్డి అనడంతో.. స్పీకర్ ప్రసాద్‌కుమార్ స్పం దిస్తూ ఆమె అందరికీ అక్కలాంటిదన్నారు.

తమ్ముడూ నా లైఫ్ స్టుల్ వేరు నీ లైఫ్ స్టుల్ వేరు

  1. వైఎస్‌ఆర్ భవనాన్ని నా కోసం కట్టుకోలేదు
  2. హైదరాబాద్‌లో ఉంటే రైతుల గురించి ఏం తెలుస్తది
  3. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి సీతక్క కౌంటర్

హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి ): ‘తమ్ముడూ నా లైఫ్ స్టుల్ వేరు.. నీ లైఫ్ స్టు ల్ వేరు’ అంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. తాను హైదరాబాద్‌లో ప్రభుత్వం వసతి క ల్పించిన వైఎస్‌ఆర్ భవనంలో నివసిస్తున్నానని, అది తన కోసం కట్టుకోలేదని, అది ప్ర భుత్వ క్వార్టర్స్ అన్నారు. రైతు బోనస్ ఇస్తామని చెప్పి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని మంత్రి సీతక్క విమర్శించారు.

రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ఈనెల లోగా ఇస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న కౌశిక్‌రెడ్డికి తమ ప్రభుత్వం రైతుల కోసం ఏం చేస్తుందో ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ములుగు నియోజకవర్గంలో నేను తిరిగినట్టు నువ్వు మీ నియోజకవర్గంలో తిరగ్గలవా అని సవాలు విసిరారు. అందుబాటులో ఎవరుంటారో తేల్చుకుందామన్నారు. మార్చి 31లోగా రైతు భరోసా ఇస్తామన్నారు.