హైదరాబాద్: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్(MLA Padi Kaushik Reddy) రెడ్డి తెలంగాణ భవన్(Telangana Bhavan) లో బుధవారం మీడియా సమావేశం(media conference) నిర్వహించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ... కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) తనని బెదిరించారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఇస్తానన్న రైతుభరోసా, రుణమాఫీపై ప్రశ్నిస్తే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనపై దాడి చేశారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) ను ప్రశ్నిస్తే తనపై 18 కేసులు పెట్టారని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. సంజయ్ పై తాను దాడి చేశానన్న వార్తలు అవాస్తవమని, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కౌశిక్ రెడ్డి మీడియా ద్వారా డిమాండ్ చేశారు.