calender_icon.png 2 April, 2025 | 9:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు మద్దతు ధరను పొందాలి

01-04-2025 01:45:19 PM

రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ,(విజయక్రాంతి): ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చి రైతులు మద్దతు ధర ను పొందాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో కొల్లూరు గ్రామంలో వరి ధాన్యము కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు మధ్య దళారులకు విక్రయించి నష్టపోవద్దని సూచించారు. సన్న రకం వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు రూ.500 క్వింటాలు కు బోనస్ చెల్లిస్తుందన్నారు.

అంతకుముందు పాత బాన్సువాడ పట్టణంలోని 26 27 28 రేషన్ షాప్ ల వద్ద సన్నబియ్యాన్ని లబ్ధిదారులకు అందజేశారు. పేద ప్రజలకు సన్న బియ్యం అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారని ఆయన తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలోని లబ్ధిదారుల తరఫున సన్న బియ్యం అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మల్లికార్జున్ బాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ మంత్రి అంజమ్మ గణేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, కృష్ణారెడ్డి, అంజిరెడ్డి మాజీ కౌన్సిలర్ పట్టణ నాయకులు పాల్గొన్నారు.

బాన్సువాడ పట్టణం,గ్రామీణ మండల పరిధిలో వరి ధాన్యం కొనుగోలు కేంcద్రాన్ని పలు రేషన్ షాప్ ల వద్ద తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజు పాత బాన్సువాడలోని రేషన్ షాప్ నం.26,27&28 వద్ద బాన్సువాడ గ్రామీణ మండలం కొల్లూరు గ్రామంలో రేషన్ షాప్ నం.10 వద్ద కార్డుదారులకు సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. అనంతరం బాన్సువాడ PACS పరిధిలోని కొల్లూరు గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ శ్రీమతి కిరణ్మయి, డీఎస్ఓ శ్రీ  మల్లికార్జున్, బాన్సువాడ పట్టణ, గ్రామీణ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.