జూకంటి జగన్నాథం :
పాడి కౌశిక్‌రెడ్డి హుజూరాబాద్ శాసనసభ్యుడే కానీ, బీఆర్‌ఎస్ పార్టీ ప్రతినిధి కాదు. ఆయనే సవాల్ విసురుతారు, ఆయనే తిరిగి తలా తోక లేని మా టలు మాట్లాడతారు. ప్రతిపక్షాలకు పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం మొదలు నుండి ఆనవాయితీగా ఉంది. మాన్యులు హరీష్‌రావు ఏమో రాజ్యాంగ పరిరక్షణ అని సన్నాయి నొక్కులు నొక్కుతారు. గత పది సంవత్సరా లలో రాజ్యాంగాన్ని ఎంతెంత రక్షించారో, ఎంత పరిహాసం చేసారో తెలంగాణ ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బీఆర్‌ఎస్ అధినాయకుల ఎనలేని సత్ప్రవర్తనకు చిహ్నాలను ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు.
కౌశిక్‌రెడ్డి, వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. మీ హుజురాబాద్ ప్రాంతం లోని ప్రజానాయకుడు, ప్రస్తుతం పార్లమెం టు సభ్యుడు అయిన నాయకుడిని గతంలో మీ పార్టీ నాయకుడు, మీరు ఎంత అవమానించినా విజ్ఞతను ప్రదర్శించి సంయమనా న్ని కోల్పోకుండా ఉన్న వ్యక్తుల నుంచి నే ర్చుకోవలసిన అవసరం మీకు ఎంతైనా ఉంది. ప్రజాస్వామ్యం గురించి మీరు, మీ పార్టీ నాయకు లు మాట్లాడితే పిల్ల వచ్చి గు డ్డును వెక్కిరించినట్టుగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పాలన లో పోలీసులపై ఆరోపణలు చేయడంలో ఇసుమంత న్యాయం లేదు. ఎందుకంటే, తెలంగాణ ఉద్యమ కాలంలో నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీ పాలన వైభవం లాగా ప్రవర్తిస్తే తెలంగాణ వచ్చేదే కాదు.
దళిత బహుజన యువకులు తమ ప్రాణాలను మంచినీళ్లలా అర్పిస్తే అధికారం అనుభవించిన మీరు దయ్యా లు వేదాలు వల్లిచ్చినట్లు ప్రజాస్వామ్యం గురించి, విలువల గురించి మాట్లాడే కనీస అర్హతను ఎప్పుడో కోల్పోయారు. మీరు అధికారంలోకి రాగానే ఎం దుకు ధర్నా చౌక్‌ను ఎత్తి వేశారో ఇప్పటికీ చెప్పలేరు. వరదలు వచ్చి ప్రజలు అల్లల్లాడుతుంటే మీరు బురదలో రాళ్ళు వేసి బట్టలు కరాబ్ చేసుకున్న విషయం ప్రజలు గమనిస్తున్నారు. కేసీఆర్ కరీంనగర్ పట్టణాన్ని డల్లాస్ చేస్తాను అని, మీ అరికాల్లో ముల్లు గుచ్చితే పంటితో తీస్తా అన్న మాటలు, చర్మం ఒలిచి నీ కాళ్లకు చె ప్పులు కుట్టించినా రుణం తీరదనే ఒల్లెక్క మాటల లెక్కలు ఎన్నో. హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరినీళ్లు గా మార్చి వేస్తామని, వరంగల్ పట్టణాన్ని వాషింగ్టన్ డీసీ, లండన్ నగరాల్లాగా చేస్తాన ని.. ఇ లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కోతలు తెలిసినవే.
మీకు, మీ పార్టీకి, మీ అధినాయకులకు విమర్శ లేదు. ఆత్మ విమర్శ అసలే కాదు. గెలికిచ్చి కొట్లాట పెట్టుకోవడం అంటే ఇదే. మీరు ప్రజల్లో రోజుకింత దిగజారి పచ్చిపులుసుకన్నా పల్చనై పోతున్నారు. తెలంగాణ ను దోచుకున్నది ఎవరో, దాచుకున్నది ఎవ రో తెలుసుకోవాలంటే 2002 నుండి మీ మీ కు టుంబాల ఎన్నికల అఫిడవిట్లో వృధ్ధి చెందిన కళ్ళు చెదిరే ఆస్తులను చూస్తే మొత్తం కుల్లం కుల్లా తెలిసిపోత ది. మీరు, మీ పథకాల గోల్మాల్ రాచకొండ ప్రభువులమని మీ అహంకారం ఇంకా తగ్గక పోవడమే పెద్ద ఆశ్చర్యం. ఇందులో ఆశ్చర్య పడాల్సిందేమీ లేదు అనిపిస్తుంది. ఎందుకం టే, మీరంతా తరతరాలకు సరిపోయేంత సం పదని పోగేసుకున్నారు. కాబట్టి, మీరు బేఫికర్‌గా ఉంటారు.
బట్టకాల్చి ఎదుటి వారిమీ ద వేయడం మీకు అలవాటే. పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు ఎవరో నేపథ్యంలో ప్రామిటింగ్ ఇస్తే డైలాగులు చెప్పడం ఎవరి రిహార్సలుకో నటించడం మీకు ఇది పాడి కానేరదు సు మా! మిమ్మల్ని బలపరుస్తున్న ద్వితీయ శ్రేణి బీఆర్‌ఎస్ నాయకులు మిమ్మల్ని చెరలో విడిచిపెట్టి చేతులు విడిచిపెట్టే వాళ్ళు అనే విష యాన్ని మీరు మరిచిపోకూడదు. గతాన్ని స మీక్షించుకుంటే ఇది తేటతెల్లమవుతుంది. 2014 టీఆర్‌ఎస్ పార్టీ మేనిఫెసో,్ట 2018 టీఆర్‌ఎస్ పార్టీ మేనిఫెస్టోలను చూస్తే వీరి హామీలు, ఆచరణ బండారం నగ్నంగా బయటపడుతుంది.
కాపాడే వారెవరో ఎవరి చేతి తో వారి కన్ను పొడుచుకునేలా కుట్ర పూరితంగా లోపాయి కారిగా వ్యవహరించే నా యకత్వం కావాలో కాపాడే పార్టీ కావాలో ఇ ప్పుడు తేల్చుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైనది. సవాళ్లు విసరడం మీ వంతే.. తోక ముడవడం మీ వంతే. ‘ప్రాంతాలుగా విడిపోదాం, అన్నదమ్ముల్లా కలిసి ఉందాం’ అని చెప్పిన అధినాయకుని అభిప్రాయం కూడా ప్రస్తుతం ఇదేనా మరి. ప్రధాన విషయం నుంచి ప్రజల దృష్టిని మరల్చే దుర్బుద్ధి రాజకీయాలు మీవి అనే విషయాన్ని మర్చిపోతే ప్రజలు ఇక మిమ్మల్ని విశ్వసించక పోవడమే కాదు ఇక ముందు మీవైపు కన్నెత్తీ చూడరు గాక చూడరు.. మీరు, మీ పార్టీ ఉద్యమాల గురించి, ఉద్యమ పార్టీ అని చెప్పుకునే అర్హతలను ఎప్పుడో కోల్పోయారు.