07-04-2025 07:17:04 PM
పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోనీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సింగిల్ విండో చైర్మన్ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం పెద్ద కొడప్గల్ పిపిసి సెంటర్లు పెద్ద కొడప్గల్, కాస్లాబాద్ 1 కస్లాబాద్ 2 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ... ఏ రకం వరి ధాన్యానికి 2320, సాధారణ రకం వరి ధాన్యానికి క్వింటాల్కు 2300 రూపాయలని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు నాగిరెడ్డి, అనంతరావు, మానిటర్ ఆఫీసర్ లక్ష్మి నారాయణ, సెక్రటరీ బి సందీప్, ఏఈఓ రాజ్యలక్ష్మి, రూప మండల కాంగ్రెస్ నాయకులు అహమ్మద్, షామప్ప పటేల్, రైతులు సిబ్బంది పాల్గొన్నారు.