24-02-2025 12:00:00 AM
మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కింద అడుగంటిన భూగర్భ జలాలు
సిద్దిపేట, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఆనకట్టను ఆనుకొని ఉన్న వ్యవసాయ భూములలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దాంతో బోరు, బావుల్లో నీరు లేక సాగుచేసిన వరి పంట ఎండిపోతుంది. సిద్దిపేట జిల్లాలోని 50 టీఎంసిల మల్లన్న సాగర్ ప్రాజెక్టు కింద గల భూములలో రైతులు సాగుచేసిన సుమారు మూడు ఎకరాల వరకు గల వరి పంట ఎండుముఖంపట్టింది. కాలువల ద్వారా నీటి సౌకర్యం లేకపోవును బోరు, బావుల్లో సైతం భూగర్భ జలం పూర్తిస్థాయిలో అడుగంటి పోయింది.
దాంతో వరి పంట ఎండి, గండు నేర్రలతో దర్శనమిస్తుంది. ప్రత్యామ్నాయంగా ఏమి చేయాలో తోచని రైతులు ఎండిపోతున్న వరి పంటను పశువులకు మేతగా వాడుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించి, సాగు చేసిన వరి పంటకు నీటిని అందించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.