calender_icon.png 19 April, 2025 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడగండ్ల వర్షానికి వరి పంట నష్టం

18-04-2025 08:00:13 PM

చేగుంట,(విజయక్రాంతి): శుక్రవారం సాయంత్రం కురిసిన వడగండ్ల వర్షానికి వరి పంటలు పూర్తి  దెబ్బతిన్నాయి. చేతి వచ్చిన పంటలు వర్షానికి తడిసి వడ్లు నేలపాలు కావడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. చేగుంట మండలం చందా యిపెట్, మక్కారాజ్ పెట్, కసన్ పల్లి, పెద్ద శివనూర్, కర్ణాల పల్లి, కసన్ పల్లి గురిజ తండా గ్రామాలలో నష్ట పోయిన రైతులు మాట్లాడుతూ... అకాల వర్షంతో తడిసి ముద్దయిన వడ్లను ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు తడిసిన వడ్లను తక్షణమే కొనాలని, వర్షానికి కొట్టుకుపోయిన వడ్లను వ్యవసాయ అధికారులు సందర్శించి నష్టపరిహారం వచ్చేటట్లు చూడాలని అన్నారు