16-04-2025 02:34:59 PM
మంచిర్యాల, (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తా నుంచి హాజీపూర్ మండల కేంద్రం వరకు బుధవారం జాతీయ బిసి హక్కుల పోరాట సమితి(National BC Rights Struggle Committee) ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. దేశవ్యాప్త బీసీ కుల గణన(Nationwide BC caste census) చేపట్టాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జన గణన పట్టికలో 34 కాలమ్స్ ఉన్నాయని, కులగణన చేరిస్తే అదనంగా ఒక కాలం మాత్రమే చేరుతుందని, దీనికి రూపాయి కూడా ఖర్చు కాదన్నారు. ఒక కాలం చేర్చడానికి వెనుకాడుతున్న కేంద్ర పాలకులు ఈ దేశంలో ఉన్న 85 కోట్ల మంది బీసీలను ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. అలాగే చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి వస్తుందని కేంద్ర పాలకులు భావిస్తున్నారన్నారు.
పార్టీలు అనుకూలంగా ఉన్నాయని, తీర్మానం చేసి కేంద్రానికి పంపినప్పటికీ బీసీ కుల గణన చేపట్టకపోవడం అంటే ఇది బీసీల వివక్షగా భావిస్తున్నామన్నారు. పది సంవత్సరాల క్రితమే మేము అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని చెప్పిన బిజెపి మోసం చేసిందని, అలాగే కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా బిసి కులగణనకు శ్రీకారం చుడతామని చెప్పి మోసం చేసిన ఘనత బిజెపికి దక్కిందన్నారు. ఇప్పటికైనా బీసీల న్యాయమైన డిమాండ్, బీసీల ఉద్యమ ఆకాంక్ష బీసీలకు రావాల్సినటువంటి ప్రజాస్వామ్యవాట ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ అంశాన్ని తీసుకెళ్లి బీసీ సమాజం ముందు బిజెపిని దోషిగా నిలబెట్టక తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, డాక్టర్ రఘునందన్, నాయకులు శాఖ పురి భీమ్ సేన్, శ్రీపతి రాములు, పెండ్లి రాములు, ఆరెందుల రాజేశం, అంకం సతీష్ , పంపరి వేణుగోపాల్, బండా సతీష్ అందే సంతోష్, చెలిమెల అంజన్న, భీమ్ రావు, సూర్ల శంకర్, ఎల్లాపుల రాజేశం తదితరులు పాల్గొన్నారు.