27-04-2025 02:48:38 PM
బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు విజయవంతం కావాలని దేవతామూర్తులకు వేడుకోలు
పెన్ పహాడ్ : సమైక్యాంధ్ర పాలకుల చేతిలో ఎడారిగా మారిన తెలంగాణ కెసిఆర్ నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కీలకంగా మారిందని.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్ర పుటలో నిలిచిపోవడమే కాదు తెలంగాణ ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్నారని పిఎసిఎస్ చైర్మన్ వెన్నె సీతారాం రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో భాగంగా వరంగల్ లో నిర్వహించ తలపెట్టిన సభ విజయవంతం కావాలని కోరుతూ ఆదివారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలోని గాజుల మల్కాపురంలో కొలువుతీరిన సమ్మక్క- సారక్క దేవతామూర్తులకు ముడుపులు కట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాం రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వరంగల్ సభకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు కుందూరు ప్రభాకర్ రెడ్డి, బిక్షం రెడ్డి, మాజీ ఎంపిటిసి రామ చంద్రు, నాయకులు కుందూరు వెంకటరెడ్డి, సందీప్ రెడ్డి, బండి వెంకటరెడ్డి, సొంటి రవి గుండు శ్రీను తదితరులు ఉన్నారు