15-03-2025 10:34:34 PM
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండల కేంద్రంలో మార్కపెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ ఛైర్మెన్ సాబ్లే కిషోర్ ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు చేపట్టపని అధికారులకు చైర్మన్ సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజాన్, మాజీ పీఏసీఎస్ ఛైర్మెన్ నానక్ సింగ్, విడిసి ఛైర్మెన్ రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.