calender_icon.png 18 April, 2025 | 7:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పిఎసిఎస్ చైర్మన్

09-04-2025 10:57:40 PM

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల పరిధిలోని బిక్కనూర్, శివాపూర్, మీసన్ పల్లి గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం నాడు పిఎసిఎస్ చైర్మన్ ఏగుల నరసింహులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్ముకొని మోసపోవద్దని, ప్రైవేటు వ్యక్తులకు ధాన్యం విక్రయిస్తే మధ్యవర్తులు, దళారులు రైతులను మోసం చేసే అవకాశం ఉంటుందని, ఎటువంటి మోసాలకు గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దని ధాన్యాన్ని విక్రయించి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ సభ్యులు ప్రకాష్, సాయిలు, సుఖేందర్ రెడ్డి, ఏఈఓ ముఖిద్, సీఈవో విశ్వనాథం, ఆయా గ్రామాల రైతులు,స్థానికులు తదితరులు పాల్గొన్నారు.