26-04-2025 01:07:14 AM
నివేదికలో బ్రిక్‌వర్క్ సంస్థ వెల్లడి
హైదరాబాద్, ఏప్రిల్ 25: భారతదేశంలో ప్యాకేజింగ్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ బ్రిక్‌వర్క్ వెల్లడించింది. 2024లో 6656 బిలియన్లు ఉన్న ఇండియన్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ మార్కెట్ పరిమాణం 2028 నాటికి 8620 బిలియన్లకు చేరుకుంటుందని తన నివేదికలో పేర్కొంది.
ఈ క్రమంలోనే 2024లో ప్రపంచ ప్యాకేజింగ్ మార్కెట్ పరిమాణం 1.24 ట్రిలియన్ డాలర్లకు చేరినట్టు తెలిపింది. దేశ వ్యాప్తంగా 22వేల ప్యాకేజింగ్ యూనిట్లు ఉన్నట్టు తెలిపింది. ఇందులోని 85 శాతం యూనిట్లు ఎస్‌ఎంఈల కిందే ఉన్నట్టు పేర్కొంది. ఈ రంగం ప్రత్యక్ష్యంగా 5లక్షల మందికి, పరోక్షంగా 1.5 బిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తున్నట్టు చెప్పింది.