calender_icon.png 5 December, 2024 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ఇక హై రిస్క్ ఫుడ్

04-12-2024 12:01:10 AM

నోటిఫికేషన్ జారీ చేసిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ

మినరల్ వాటర్, డ్రింకింగ్ వాటర్ బాటిళ్ల పరిశ్రమల్లో ఇక ఏటా తనిఖీలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: వాటర్ బాటి ల్ సహా ప్యాక్ చేసిన డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్ ‘హై-రిస్క్ ఫుడ్’ క్యాటగిరీలోకి వెళ్లాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాం డర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ప్లాస్టిక్ క్యాన్లు, బాటిళ్లలో అమ్మే డ్రికింగ్ వాటర్‌ను హైరిస్క్ ఫుడ్ క్యాటగిరీలోకి చేర్చుతూ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.  ఈ ఉత్పత్తులకు బీఐఎస్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా చేయాలని అక్టోబర్‌లో ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు పర్చడంలో భాగంగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తాజా నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

దీని ప్రకారం ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాట ర్ పరిశ్రమలను అధికారులు ముందుగా తనిఖీ చేసి, ప్రమాణాలు కచ్చితంగా పాటించినట్టు నిర్ధారించుకున్న తర్వాతే వాటి రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇచ్చి లైసెన్సులు మంజూరు చేస్తారు. 

హై రిస్క్ ఫుడ్ అంటే..

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ను హైరిస్క్ ఫుడ్ క్యాటగిరీలోకి మార్చినందు వల్ల అవి సురక్షితం కాదని వాటిని తాగితే అనారోగ్యానికి గురవుతామని కొందరు భ్రమపడుతుంటారు. కానీ అది అవాస్తవం. ఆహార పదార్థాలను హై క్యాటగిరీలోకి చేర్చడం ద్వారా వాటి భద్రత,  నాణ్యత ప్రమాణా లు మరింత పెరుగుతాయి. ఈ క్యాటగిరీలోని ఉత్పత్తులను తయారు చేసే సంస్థల ను అధికారులు ఏటా తనిఖీలు చేస్తారు. నిర్దేశిత ప్రమాణాలు పాటిస్తూనే ఉత్పత్తులను తయారు చేస్తేనే ఆయా సంస్థలకు లైసెన్సులను రెన్యువల్ చేస్తారు. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్‌ను ఈ క్యాటగిరీలోకి చేర్చడం ద్వారా ప్రజలకు మరింత స్వచ్ఛమైన త్రాగు నీరు మార్కెట్‌లో లభించే అవకాశం ఉంది.

హై క్యాటగిరీలోని ఇతర ఉత్పత్తులు

* పాల ఉత్పత్తులు

* పౌల్ట్రీతో సహా మాంసం, మాంసం ఉత్పత్తులు

* చేపలు, చేప ఉత్పత్తులు, రొయ్యలు, పీతలు తదితర నీటి సంబంధ ఆహార పదార్థాలు

* గుడ్లు, గుడ్ల ఉత్పత్తులు

* భారతీయ మిఠాయిలు

* ప్రిపేర్డ్ ఫుడ్స్

* నిర్దిష్ట పోషక అవసరాల కోసం తయారు చేసిన ఆహార పదార్థాలు

* ఫోర్టిఫైడ్ రైస్