మంత్రి తుమ్మల సూచన
ఖమ్మం, ఆగస్టు 31 (విజయక్రాంతి): పెసర కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శనివారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ని పెసర కొనుగోలు కేంద్రాన్ని మంత్రి తనిఖీ చేశారు.
మద్దతు ధర ప్రకారం పెసర్లు కొ నుగోలు చేయాలని ఆదేశించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాన్ని రైతు లు సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. ఆయనవెంట జిల్లా మార్కెట్ ఫెడ్ అధికారి సునీత, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య ఉన్నారు.
ఖమ్మం డీసీసీబీలో అవినీతిపై విచారణ
ఖమ్మం డీసీసీబీలో అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణకు ఆదేశించామని మ ంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అధికారులు, సిబ్బందితోపాటు ఎవరు అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తప్పవన్నారు.