calender_icon.png 4 March, 2025 | 11:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఓజోన్ 12వ వార్షికోత్సవం

03-03-2025 12:36:57 AM

హైదరాబాద్, మార్చి 2 (విజయక్రాంతి): ఓజోన్ హాస్పిటల్ 12వ వార్షికోత్సవాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హాస్పిటల్ చైర్మన్ సత్యసాయిప్రసాద్ మాట్లాడుతూ.. సమాజానికి తన వంతు సాయంగా వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో, సగటు వ్యక్తికి అందుబాటు ధరల్లో సేవలు అందించేలా ఓజోన్ హాస్పిటల్‌ను స్థాపించినట్టు చెప్పారు.

తమ వద్ద నాణ్యమైన వైద్యం తక్కువ ఖర్చులో అందరి కీ అందుబాటులో ఉందని పేర్కొన్నారు. హాస్పిటల్ ఎండీ దీప్తి మాట్లాడుతూ.. సామాన్యులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు నర్సింగ్, ఫార్మసీ వివిధ విభాగాల్లో వృత్తివిద్య పూర్తిచేసుకున్న వారికి స్కాలర్‌షిప్‌లు అందించి, వైద్య వృత్తిలోకి పంపిస్తున్న ట్టు చెప్పారు.

ముఖ్యఅతిథిగా హాజరైన స్పీక ర్ ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ.. 12వ వా ర్షికోత్సవం జరుపుకుంటున్న ఓజోన్ హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలి పారు. కొవిడ్ సమయంలో ఎంతో విలువైన సేవలందించారని కొనియాడారు. కార్యక్రమంలో హాస్పిటల్ సీఈవో శ్రీనివాసరావు, ఎండీ మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.