calender_icon.png 11 January, 2025 | 9:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆక్సిజన్ ఫేషియల్!

17-12-2024 12:00:00 AM

ప్రతి అమ్మాయికి అందంగా కనిపించాలనే కోరిక ఉండటం సహజం. దీని కోసం రకరకాల ట్రీట్మెంట్స్, బ్యూటీ ప్రాడక్ట్స్ వాడుతుంటారు. అయితే ప్రస్తుతం చర్మ సౌందర్యం కోసం చేసే వివిధ ప్రక్రియల్లో ఆక్సిజన్ ఫేషియల్ ట్రెండింగ్‌లో ఉంది. అసలు ఆక్సిజన్ ఫేషియల్ అంటే ఏమిటి? ఈ ప్రక్రియ వల్ల చర్మానికి కలిగే లాభాలు ఏంటి? అనేది తెలుసుకుందాం.. 

సాధారణంగా ఆక్సిజన్ ఫేషియల్ స్పాలలో సౌందర్య నిపుణులు ఉపయోగించే ఒక ప్రక్రియ. ఇది చాలా సురక్షితమైన ప్రక్రియగా చెబుతారు. ఎందుకం టే ఇందులో ఎలాం టి రసాయనాలు ఉండవు. ఆక్సిజన్ ఫేషియల్ చర్మానికి లోతైన హైడ్రేషన్, గ్లోను అందిస్తుంది. ఈ ప్రక్రియ చేయడానికి ముందు మొదట చర్మాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఎక్స్‌ఫోలియేషన్ లైట్ స్క్రబ్బింగ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.

ఆక్సిజన్ ఫేషియల్ ప్రక్రియలో విటమిన్లు, హైలురోనిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉన్న సీరంను చర్మంపై ఉపయోగిస్తారు. ఇది తేమను పెంచడం, మచ్చలను తొలగించి.. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఆ తర్వాత ఆక్సిజన్ స్ప్రే (ఆక్సిజన్ ఇన్ఫ్యూషన్) చేస్తారు. ఈ స్ప్రే ఆక్సిజన్ పరికరం ద్వారా చర్మంపై స్ప్రే చేయబడుతుంది. సీరంతో కూడిన ఆక్సిజన్ స్ప్రే చేయడం వల్ల పోషకాలు చర్మంలోకి లోతుగా వెళ్లడానికి సహాయపడతాయి. ఈ ప్రక్రియ 45 నిమిషాల నుంచి ఒక గంట వరకు పడుతుంది.