calender_icon.png 19 March, 2025 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సునీత విలియం, బారీ విల్మోర్ రాక కోసం ఆక్స్ ఫర్డ్ విద్యార్థుల స్వాగత ప్రదర్శన..

18-03-2025 06:32:41 PM

ముషీరాబాద్ (విజయక్రాంతి): సుమారు 8 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలియం, బారీ విల్మోర్ లను ఆక్స్ ఫర్డ్ గ్రామర్ స్కూల్ విద్యార్థులు తిరిగి భూమికి స్వాగతించే అద్భుత బ్యానర్లను మంగళవారం ప్రదర్శించారు. వారు సురక్షితంగా తిరిగి రావడానికి స్పేస్ ఎక్స్ చేసిన చారిత్రాత్మక ప్రయత్నాలను గౌరవిస్తూ విద్యార్థులు, అధ్యాపకులు ఈ అద్భుత అంతరిక్ష యాత్రను వీక్షించడానికి ఎదురుచూస్తున్నారని స్కూల్ కరస్పాండెంట్ కట్టా ప్రభాకర్ తెలిపారు. వ్యోమగాముల పట్టుదలను, ధైర్యాన్ని వారు ప్రశంసించారు. స్పేస్ ఎక్స్ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు అకుంఠిత ప్రయత్నాల వల్ల రెస్క్యూ నౌక వలన ఇది సాధ్యమైనదని కొనియాడారు.

ఈ సందర్భంగా విద్యార్థులు అంతరిక్ష పరిశోధనల పురోగతి గురించి, శాస్త్ర సాంకేతిక రంగాలను ఎంచుకోవడానికి ఇటువంటి సంఘటనలు వారిని ప్రేరేపించే విధంగా ఉన్నాయని వారు ఉత్సాహంతో తెలియజేశారు. యువ అభ్యాసకులలో అంతరిక్ష శాస్త్రం పట్ల ఉత్సుకతను పెంచడానికి ఈ పాఠశాల ఒక నిదర్శనంగా నిలిచింది. ఆక్స్ ఫర్డ్ గ్రామర్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన బ్యానర్లతో విద్యార్థుల తల్లిదండ్రులు సెల్ఫీలు దిగి వ్యోమగాములతో కలిసి ఉన్నట్లుగా అనుభూతులను పొందుతున్నారు.