22-03-2025 11:21:55 PM
ముషీరాబాద్ (విజయక్రాంతి): ఆక్స్ ఫర్డ్ గ్రామర్ స్కూల్ జూనియర్స్ పాఠశాల ఆడిటోరియంలో ’కిండర్ గార్టెన్ గ్రాడ్యు యేషన్ డే’ను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ వైస్ చైర్ పర్సన్ ప్రార్ధన మణికొండ మాట్లాడుతూ... చిన్నారులు ఆహ్లాదకరమైన, రంగు రంగుల దుస్తులు ధరించిన సంగీతం, నృత్యం, ప్రసంగాల ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించారని తెలిపారు. యువ గ్రాడ్యుయేట్లు సాధించిన విజయాలను అభినందించారు. కెజి గ్రాడ్యుయేషన్ డిప్లొమాల పంపిణీ తల్లిదండ్రులకు భావోద్వేగ క్షణం అన్నారు.
వారు ఒక చిరస్మరణీయమైన, సుసంపన్నమైన విద్యా సంవత్సరం ముగింపును చూశారన్నారు. ఈ వేడుక విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు చిరస్మరణీయమైన జ్ఞాపకాలను మిగిల్చిందన్నారు. యువ గ్రాడ్యుయేట్లు తమ ఏడాది పొడవునా ప్రయాణం గురించి అనుభవాలు పంచుకున్నారు. ఈ వేడుకల్లో కరస్పాండెంట్ కట్టా ప్రభాకర్, డీన్ రామాంజుల, ప్రిన్సిపాల్ ఫాతిమా కాజిమ్ తదితరులు పాల్గొన్నారు.