వరద బాధితులకు సాయం
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 11(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని నవ లిమిటెడ్ సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా ఖమ్మం వరద బాధితులకు వంటసామగ్రి, దుప్పట్లు పంపిణీ చేసింది. సుమారు 1,000 కుటుంబాలకు సరిపడా సామగ్రిని నవ లిమిటెడ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ లింగం వెంకటశరత్‌బాబు ఆధ్వర్యంలో బుధవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ ప్రసాద్, వైవి శ్రీనివాస్, ఎన్ సురేష్‌చంద్ర, రత్నకిషోర్, రామరావు పాల్గొన్నారు.