calender_icon.png 5 January, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొంతింటి పథకం అమలు చేయాలి

02-01-2025 07:46:55 PM

రాష్ట్ర మంత్రులకు వినతి పత్రం అందించిన సీఐటియు నాయకులు...

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేసి, మారు పేర్లు మార్పు చేయాలని, పెర్క్స్ పై ఐటీ మాఫీ చేయాలని కోరుతూ సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) చేస్తున్న ఆందోళన కార్యక్రమాలలో భాగంగా గురువారం సచివాలయంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లకు సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి నాయకత్వంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా రంగారెడ్డి మాట్లాడారు. కార్మికుల దీర్ఘకాలిక పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంస్థకు రావలసిన 33 వేల కోట్ల బకాయిల చెల్లింపు వంటి సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరారు.

సొంతింటి పథకం అమలు వలన అటు యాజమాన్యానికి ఇటు ప్రభుత్వానికి ఎలాంటి భారం పడకుండా అమలు చేయవచ్చని మంత్రులకు వివరించడంతో వారు సానుకూలత వ్యక్తం చేసి త్వరలో ఈ విషయంపై సిఐటియు యూనియన్ తో సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో యూనియన్ సలహాదారు భూపాల్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు, మందమర్రి బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్.వెంకటస్వామి అల్లి రాజేందర్, శ్రీరాంపూర్ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు గుల్ల బాలాజీ, అంబాల శ్రీనివాస్, ఆర్జి1 అధ్యక్ష కార్యదర్శులు ఆరెపల్లి రాజమౌళి మేండే, శ్రీనివాస్, మెదరి సారయ్య, ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్ ఈద వెంకటేశ్వర్లు, ఆర్జి 2 అధ్యక్ష కార్యదర్శులు రాంప్రసాద్, కుంట ప్రవీణ్ కుమార్, ఆర్జీ-3 నుండి రవికుమార్, శ్రీనివాస్, కొత్తగూడెం బ్రాంచ్ కార్యదర్శి విజయగిరి శ్రీనివాస్ లు పాల్గొన్నారు.