28-08-2024 12:22:18 AM
బీఆర్‌ఎస్ హయాంలో ఎంఐఎం కబ్జాలు
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27 (విజయక్రాంతి): ప్రభుత్వ భూమిలో హైదరా బాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బంగ్లా కట్టాడని, బీఆర్‌ఎస్ అండతో గత పదేళ్లలో ఎంఐఎం పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా కబ్జాలు చేశారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. హైడ్రా నిర్ణయంపై సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ రాజాసింగ్.. తాను మాట్లాడిన ఒక వీడియోను విడుదల చేశారు. ప్రభుత్వ భూముల్లోని ఒవైసీ కట్టడాలను వెంటనే బుల్డోజర్లతో కూల్చాలి.
30 ఎకరాలున్న చెరువు భూముల్లో 12ఎకరాలను కబ్జా చేసి ‘ఫాతిమా కేజీ టూ పీజీ ఎడ్యుకేషన్’ కాలేజీని నిర్మించారని ఆరోపించారు. ఉచిత విద్య పేరిట కోట్లు గడిస్తున్నారని.. ఈవియమై అక్కడివారే ఫిర్యాదు చేశారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చెరువుల కబ్జాలపై సీఎం రేవంత్‌రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. గోషామహల్ నియోజకవర్గంలోని కొనిన భూములనూ ఎంఐఎం నేతలు కబ్జా చేశారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ అండతో ఎంఐఎం చేసిన కబ్జాలన్నింటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ సీఎంను కోరారు.