calender_icon.png 30 October, 2024 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోల్తా పడ్డ ఆయిల్ ట్యాంకర్

06-07-2024 12:48:44 AM

అశ్వారావుపేట, జూలై 5 : శనగ నూనే లోడుతో వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మొద్దులగూడెం రహదారిపై చోటుచేసుకుంది. దమ్మపేట ఎస్‌ఐ సాయి కిషోర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, కాకినాడ నుండి హైదరాబాద్‌కు శనగనూనె తరలిస్తున్న ఆయిల్ ట్యాంకర్ దేవరపల్లి రాష్ట్రీ య రహదారిపై ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి ఆయి ల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ విషయం తెలుసుకున్న స్ధానిక ప్రజలు నూనె పట్టుకొనేందుకు ఎగబడ్డారు. సమాచారం అం దుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రజలను పంపించేశారు. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి.