calender_icon.png 8 October, 2024 | 2:01 AM

అతిగా నిద్రపోతున్నారా?

02-09-2024 12:00:00 AM

ప్రతిఒక్కరికీ నిద్ర చాలా అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్ర పోవాలి. ఎక్కువ నిద్ర, తక్కువ నిద్ర రెండూ కూడా ఆరోగ్యానికి ప్రమాదకమే. ముఖ్యంగా ఉద్యోగుల్లో నిద్రలేమి సమస్య ఎక్కువగా ఉంటుంది. పని దినాల్లో తక్కువ నిద్ర.. వారంతాల్లో ఎక్కువగా నిద్ర పోతుంటారు. అయితే ఈ రెండు ప్రమాదకమే అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా అతి నిద్ర అనేక రకాల ఆరోగ్య రుగ్మతలకు కారణమవుతుంది. ఒక మనిషికి ఎంత నిద్ర అవసరమనేది వయస్సు, జీవనశైలి బట్టి నిర్ణయించబడుతుంది. అయితే తొమ్మిది గంటల కంటే ఎక్కువ నిద్రించే వ్యక్తులకు గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు.. అతిగా నిద్రపోతే మానసికంగా, శారీరకంగా ప్రభావం పడుతుంది.

స్లీపింగ్ పొజిషన్ సరిగ్గా లేకపోతే కండరాల నొప్పి మరింత తీవ్రంగా మారుతుంది. సాధారణంగా నిద్రలేమి సమస్య వల్ల డిప్రెషన్ ఎక్కువగా వస్తుంటుంది. అతి నిద్ర వల్ల కూడా డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దాదాపు 15% మందిలో అధిక నిద్ర వల్ల డిప్రెషన్ వస్తున్నట్లు పలు పరిశోధనల్లో వెల్లడైంది. అతినిద్ర దీర్ఘకాలిక నాడీ వ్యవస్థ రుగ్మతలకు కారణమవుతుంది.