బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్: మహాత్మా జ్యోతి బాపులె ఓవర్సీస్ స్కాలర్ షిప్ లు రెండు లేదా మూడింతలు చెస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. సంవత్సరానికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ మార్చి 2024 లోనే పూర్తి చేయాల్సి ఉందని, ఎన్నికల కోడ్ కారణంగా ప్రక్రియ జాప్యం జరిగిందని తెలిపారు. ఈ ఓవర్సిస్ స్కాలర్షిప్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 300 మందికి ఇచ్చేవారని వాటి సంఖ్య రెండింతలు లేదా మూడింతలు చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ఓవర్సీస్ స్కాలర్షిప్ అర్హుల ఎంపిక జరిగినప్పటికీ అన్ని కలిపి ఒకేసారి రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.
ఓవర్సీస్ స్కాలర్షిప్ అప్లికేషన్ చేసుకున్న విద్యారులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఓవర్సీస్ స్కాలర్షిప్ కి గత సంవత్సరంకి సంబంధించి మొదటి దశ అందుకున్నవారు కూడా రెండవ దశ పేమెంట్ చేయడానికి ప్రభుత్వ అధికారులు ఆర్థిక శాఖ వారిని సంప్రదించడం జరిగిందన్నారు. త్వరలోనే వాటి కోసం నిధులు విడుదల చేస్తామని సానుకూలంగా స్పందించారని ఓవర్సీస్ స్కాలర్షిప్ లను పెంచడానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి వర్గం అంత ఓవర్సీస్ స్కాలర్షిప్ ల సంఖ్యను పెంచాలని సానుకూలమైన ఆలోచన ఉందన్నారు. ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎక్కువ మందికి ఇవ్వాలని మా ప్రభుత్వ ఉద్దేశ్యం ఇది అందరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు.