హైదరాబాద్, అక్టోబర్ 10 (విజయక్రా ంతి): గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం జీవో తీసుకొచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓవర్సీస్ మ్యా న్ పవర్ రిక్రూట్‌మెంట్ ఏజెంట్స్ అసోసి యేషన్ (ఓమ్రా) అధ్యక్షుడు డీఎస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆమోదంతో విదేశీ ఉద్యోగా ల భర్తీలో ముఖ్యపాత్ర పోషిస్తున్న రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీల సేవలను కూడా తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో 150 రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీలు ఉన్నాయని ఆయన చెప్పారు. త్వరలో నియమించే గల్ఫ్ సంక్షేమ సలహా కమిటీలో రిక్రూటర్స్‌కు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.