ముంబై: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ కోసం సిద్ధమవుతోన్న జట్టు ప్రస్తుతం మానసిక దృఢత్వంపై దృష్టి సారించినట్లు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొంది. చివరి ఓవర్లలో నెలకొంటున్న ఒత్తిడిని అధిగమించి ఈసారి టీ20 విజేతగా నిలుస్తామని హర్మన్ ధీమా వ్యక్తం చేసింది. ‘టీ20 క్రికెట్ చిన్న ఫార్మాట్ ఏం కాదు. రోజు మొత్తం కలిపి 40 ఓవర్లు ఆడుతున్నాం. చివరి 3 ఓవర్లు మాకు కీలకం.
కొన్నేళ్లుగా మంచి ఆటతీరు ప్రదర్శిస్తున్నప్పటికీ చివరి ఓవర్లలో ఒత్తిడిని అధిగమించలేకపోతున్నాం. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో జట్టు మొత్తం మెంటల్ స్ట్రెం త్‌పై దృష్టి సారించింది. చివరి ఓవర్లలో ఒత్తిడిని అధిగమిస్తే విజేతగా నిలిచే అవకా శముంది’ అని హర్మన్ చెప్పుకొచ్చింది. 2020 టీ20 ప్రపంచకప్‌లో మహిళల జట్టు రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఇటీవలి కాలంలో చివరి ఓవర్లలో ఒత్తిడిని అధిగమించడంలో విఫలమవుతున్న హర్మన్ సే న కామన్‌వెల్త్ గేమ్స్‌తో పాటు ఆసియా కప్ టోర్నీలోనూ ఫైనల్లో చిత్తవ్వడం గమనార్హం. ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్ 4న కివీస్‌తో మ్యాచ్ ద్వారా టోర్నీని ప్రారంభిం చనున్న భారత్ ఆ తర్వాత వరుసగా పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియాలను ఎదుర్కోనుంది.